Wheel of Dhamma

Bodhi Leaf

 
Nijjhana
Dhamma Nijjhāna, Nizamabad, Telangana, ఇండియా
ధ్యాన కేంద్ర స్థానము: వెబ్ సైట్ | పటం
**ప్రత్యేక సూచనలు ఇస్తే తప్ప, శిబిరం నియమాలు క్రింది భాషలలోనే తెలుపబడును: హిందీ / ఆంగ్లం / తెలుగు

 
కిశోర మరియు పిల్లల శిబిరంలు
యువజనుల కోసం శిబిరాలు
ఈ విభాగంలో ఉన్న కార్యక్రమాల ప్రత్యక సూచనల కోసం వ్యాఖ్యానాలను చూడండి.
2025 కిశోర మరియు పిల్లల శిబిరంలు
సాధన / సేవ తేదీలు శిబిర రకము: ప్రస్తుత పరిస్థితి: ప్రదేశము వ్యాఖ్యలు
05 Apr - 13 Apr ఏడు రోజుల కిశోర శిబిరం పూర్తి చేయబడినది Nizamabad
14 Apr - 22 Apr ఏడు రోజుల కిశోర శిబిరం పూర్తి చేయబడినది Nizamabad
 
10 రోజుల మరియు ఇతర పెద్ద వాళ్ళ శిబిరములు
అన్ని పది రోజుల శిబిరంలు మొదటి రోజు సాయంత్రం ప్రారంభమయ్యి చివరి రోజు తర్వాతి రోజు ఉదయం ముగియబడతాయి
ఈ విభాగంలోని కార్యక్రమాల ప్రత్యేక నియమాల కొరకు సూచనలను చూడండి
2025 10 రోజుల మరియు ఇతర పెద్ద వాళ్ళ శిబిరములు
సాధన / సేవ తేదీలు శిబిర రకము: ప్రస్తుత పరిస్థితి: ప్రదేశము వ్యాఖ్యలు
15 Jan - 26 Jan 10-రోజుల శిబిరం పూర్తి చేయబడినది Nizamabad
02 Feb - 17 Feb ఆచార్యుల స్వీయ శిబిరం పూర్తి చేయబడినది Nizamabad ప్రత్యేక శిబిర అర్హతలు
19 Feb - 02 Mar 10-రోజుల శిబిరం పూర్తి చేయబడినది Nizamabad
05 Mar - 13 Mar సతిపట్ఠాన సుత్త శిబిరం పూర్తి చేయబడినది Nizamabad ప్రత్యేక శిబిర అర్హతలు
18 Mar - 29 Mar 10-రోజుల శిబిరం పూర్తి చేయబడినది Nizamabad
23 Apr - 04 May 10-రోజుల శిబిరం ప్రగతిలో ఉంది Nizamabad
దరఖాస్తు 07 May - 18 May 10-రోజుల శిబిరం తెరవబడినది Nizamabad
దరఖాస్తు 21 May - 01 Jun 10-రోజుల శిబిరం తెరవబడినది Nizamabad
దరఖాస్తు 04 Jun - 15 Jun 10-రోజుల శిబిరం తెరవబడినది Nizamabad
దరఖాస్తు 18 Jun - 29 Jun 10-రోజుల శిబిరం తెరవబడినది Nizamabad
దరఖాస్తు 02 Jul - 13 Jul 10-రోజుల శిబిరం తెరవబడినది Nizamabad
దరఖాస్తు 16 Jul - 27 Jul 10-రోజుల శిబిరం తెరవబడినది Nizamabad
30 Jul - 10 Aug 10-రోజుల శిబిరం దరఖాస్తులు స్వీకరించుట మొదలయ్యింది 01 May Nizamabad
13 Aug - 24 Aug 10-రోజుల శిబిరం దరఖాస్తులు స్వీకరించుట మొదలయ్యింది 15 May Nizamabad
27 Aug - 29 Aug ఇతరములు దరఖాస్తులు స్వీకరించుట మొదలయ్యింది 29 May Nizamabad
31 Aug - 21 Sep 20-రోజుల శిబిరం దరఖాస్తులు స్వీకరించుట మొదలయ్యింది 02 Jun Nizamabad ప్రత్యేక శిబిర అర్హతలు
23 Sep - 04 Oct 10-రోజుల శిబిరం దరఖాస్తులు స్వీకరించుట మొదలయ్యింది 25 Jun Nizamabad
06 Oct - 17 Oct 10-రోజుల శిబిరం దరఖాస్తులు స్వీకరించుట మొదలయ్యింది 08 Jul Nizamabad
22 Oct - 02 Nov 10-రోజుల శిబిరం దరఖాస్తులు స్వీకరించుట మొదలయ్యింది 24 Jul Nizamabad
05 Nov - 16 Nov 10-రోజుల శిబిరం దరఖాస్తులు స్వీకరించుట మొదలయ్యింది 07 Aug Nizamabad
19 Nov - 30 Nov ప్రత్యేక 10 రోజుల శిబిరం దరఖాస్తులు స్వీకరించుట మొదలయ్యింది 21 Aug Nizamabad ప్రత్యేక శిబిర అర్హతలు
03 Dec - 14 Dec 10-రోజుల శిబిరం దరఖాస్తులు స్వీకరించుట మొదలయ్యింది 04 Sep Nizamabad
17 Dec - 28 Dec 10-రోజుల శిబిరం దరఖాస్తులు స్వీకరించుట మొదలయ్యింది 18 Sep Nizamabad
 
 

మీరు ఆన్ లైన్లో నింపిన దరఖాస్తు, మీ కంప్యూటర్ నుండి అప్లికేషను సర్వర్ కు పంపే ముందు, మీ సమాచారం ఎన్క్రిప్షన్ (గుప్తీకరణ) చేయబడుతుంది. అయితే ఇది పూర్తిగా సురక్షితం కాకపోవచ్చు. ఎన్క్రిప్షన్ ఉపయోగించినప్పటికి మీ సమాచార భద్రత గురించి మీకు ఆందోళన ఉంటే ఇంటర్నెట్, బదులుగా ఈ దరఖాస్తును డౌన్లోడ్ చేసుకుని, ప్రింట్ తీసుకుని, పూర్తి చేసిన తరువాత దరఖాస్తును ఫ్యాక్స్ ద్వారా కాని పోస్ట్ ద్వారా కాని శిబిరం నిర్వాహకులకు పంపండి. ఇది నమోదు ప్రక్రియను ఒకటి లేక రెండు వారాల వరకు ఆలస్యం చేయవచ్చు.


పాత సాధకులు ప్రాంతీయ సైట్ ను చూడతలచినచో దయచేసి క్రింది http://nijjhana.dhamma.org/os ను క్లిక్ చేయండి. ఈ సైట్ ను చూడటానికి యూజర్ పేరు మరియు పాస్వర్డ్ ఇవ్వాల్సి ఉంటుంది.

ప్రశ్నలు ఇమెయిల్ చిరునామాకు పంపవచ్చు: info@nijjhana.dhamma.org

అన్ని శిబిరంలు విరాళాల ఆధారంగా మాత్రమే నడుస్తాయి. అన్ని ఖర్చులు శిబిరం పూర్తిచేసిన వాళ్ళు, విపశ్యన యొక్క ప్రయోజనాలు అనుభవించి, అదే అవకాశం ఇతరులకు కూడా అందాలని అనుకుంటున్న వారి విరాళ ద్వారా వచ్చిన ఆదాయంతోనే జరుగుతున్నాయి. ఆచార్యులు, సహాయక ఆచార్యులు కూడా ఆదాయం పొందరు. శిబిరాలలో సేవ చేసే వారు తమ సమయాన్ని ఐచిక్కంగా వెచ్చిస్తున్నారు. అందువలన విపశ్యన వ్యాపారీకరణ చేయకుండా ఉచితంగా నేర్పబడుతుంది.

పాత సాధకులు అనగా శ్రీ గోయెంక గారి లేదా తన సహాయక ఆచార్యుల ఆధ్వర్యంలో ఒక 10 రోజుల విపశ్యన ధ్యానం శిబిరం పూర్తి చేసిన వారు అని అర్థం.

పాత సాధకులకు పైన పేర్కొన్న శిబిరంలలో ధమ్మ సేవ అందించడానికి అవకాశం కలదు.

ద్విభాషా శిబిరంలు శిబిరంలను రెండు భాషల్లో నేర్పిస్తారు. విద్యార్థులు అందరూ రోజువారీ ధ్యానం సూచనలను రెండు భాషల్లో వినవచ్చు సాయంత్రం ప్రవచనాలను విడిగా వినవచ్చు.

ధ్యాన శిబిరంలు కేంద్రం మరియు కొన్ని కేంద్రం లేని ప్రాంతాలలో కూడా జరుగుతాయి. ధ్యానం కేంద్రాలలో శిబిరంలు ఏడాది పొడవునా క్రమం తప్పకుండా జరగడానికి ప్రత్యేక సౌకర్యాలు ఉన్నాయి. ఈ సాంప్రదాయం లో ధ్యాన కేంద్రాలు స్థాపించబడడానికి ముందు, అన్ని శిబిరంలు, మత, విడిది కేంద్రాలు, చర్చిలు మరియు కాంప్ గ్రౌండ్ లు వంటి తాత్కాలిక ప్రాంతాలలో జరిగేవి. నేడు కేంద్రాలు ఏర్పాటు కాని ప్రాంతాల్లో, ఆయా ప్రాంతంలో నివసించే విపశ్యన స్థానిక విద్యార్థులచే 10 రోజుల ధ్యాన శిబిరంలు నిర్వహించబడుతున్నాయి.


10-రోజుల శిబిరాలు విపశ్యన ధ్యానము యొక్క పరిచయ శిబిరాలు. ఇక్కడ విపశ్యన ధ్యాన పద్ధతి ప్రతి రోజూ అంచెలంచెలుగా నేర్పించబడుతుంది. ఈ శిబిరాలు సాయంత్రము 2 - 4 గంటల తరువాత నమోదు మరియు వివరణ అయిన పిమ్మట మొదలవుతాయి. ఆ తరువాత 10 రోజుల సంపూర్ణ సాధన. 11వ రోజు ఉదయం 7:30 గంటలకు ముగియబడతాయి.


ఇది 15-19 సం||ల మధ్య ఉన్న యువతీ యువకుల కోసం నిర్వహించే ఏడు రోజుల శిబిరము

ప్రత్యేక శిబిర అర్హతలు

సతిపట్ఠాన సుత్త శిబిరము 10 రోజుల శిబిరము కాలపట్టిక మరియు నియమావళిని పోలి ఉండును. తేడా ఏమిటంటే సాయంత్రపు ప్రవచనాలలో సతిపట్ఠాన సుత్త జాగ్రత్తగా పరిశీలించబడుతుంది. ఈ సుత్తలో విపశ్యన ధ్యాన విధానము సక్రమముగా వివరించబడింది. ఈ శిబిరములు కనీసము మూడు 10 రోజుల శిబిరములు (సేవ ఇచ్చిన శిబిరములను మినహాయించి) చేసి, చివరి 10 రోజుల శిబిరము తరువాత ఇతర ఏ ధ్యాన పద్ధతినీ అనుసరించకుండా, విపశ్యన ధ్యాన సాధనను గత ఒక్క సంవత్సరము నుండి చేస్తూ, తమ సాధనలో నిరంతరతను నిలుపుకునే ప్రయత్నంలో ఉండి, పంచ శీలాలను తమ నిత్య జీవనంలో పాటిస్తున్న గంభీర పాత సాధకుల కొరకు నిర్దేశించబడినవి.


ప్రత్యేక శిబిర అర్హతలు

ప్రత్యేక 10 రోజుల శిబిరాలు గంభీర పూర్వ సాధకులు ఎవరైతే కనీసము ఐదు 10 రోజుల శిబిరాలు, ఒక్క సతిపట్ఠాన శిబిరం, కనీసము ఒక్క 10 రోజుల శిబిరంలో సేవను పూర్తి చేసుకుని మరియు నియమబద్ధంగా కనీసము గత 2 సంవత్సరాలు ఈ ధ్యానము మాత్రమే సాధన చేస్తున్న వారికోసమే

20 రోజుల శిబిరాలు కనీసము ఐదు 10 రోజుల శిబిరాలు, ఒక్క సతిపట్ఠాన సుత్త శిబిరం, కనీసము ఒక్క 10 రోజుల శిబిరంలో సేవ చేసి, కనీసము 2 సంవత్సరాలు నియమ బద్ధంగా సాధన చేస్తూ ఈ ధ్యాన పద్ధతికే కట్టుబడి ఉన్న గంభీర సాధకుల కొరకు మాత్రమే .

ఆచార్యుల స్వీయ శిబిరాలు గంభీర పాత సాధకులు ఎవరైతే ధమ్మంను విస్తరింపజేయుటకు ప్రముఖ పాత్ర వహిస్తున్నారో లేక వహించాబోతున్నారో, విపశ్యన సాధనను నిష్ఠగా చేస్తూ (ఇతర ఏ విధములైన ధ్యాన పద్ధతులను అనుసరించకుండా) రోజూ 2 గంటల సేపు ధ్యానం చేస్తూ. హింస,వ్యభిచారము, మద్యపానముల నుండి దూరంగా ఉంటూ ఇతర శీలములను స్వశక్తి మేరకు పాటిస్తూ ఉన్న వారి కొరకు మాత్రమే. ఈ నియమాలు శ్రీ సత్యనారాయణ గోయెంకా గారి నిర్దేశానుసారము ప్రతి ఏటా మారవచ్చును.

దరఖాస్తు ప్రక్రియకు కొంత సమయం పడుతుంది కనుక దరఖాస్తులను చాలా ముందుగానే సమర్పించాలి. ఇంగ్లీష్ లేదా ఇతర ప్రకటించిన శిబిర భాషలు ఒక్కటి కూడా రాని సాధకులు, శిబిరం కోసం దరఖాస్తు అయితే పంపవచ్చు కానీ అంగీకారం మటుకు శిబిరం నిర్వహించడానికి అవసరమైయే సామాగ్రి, అనువైన అనువాదకుల మరియు శిబిరం నిర్వహించే గురువు అనుమతి లభ్యత మీద ఆధారపడి ఉంటుంది.